‘నాకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు’.. బీజేపీలో విభేదాలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-17 15:01:53  IST  )

తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘నాకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు’.. బీజేపీలో విభేదాలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గతంలో నాకు వ్యతిరేకంగా కూడా కొందరు పనిచేశారు. కరీంనగర్‌లో తక్కువ ఓట్లు రావాలని కుట్రలు చేశారు. బీజేపీలో వర్గాలు ఉండవు.. ఉండకూడదు. అలాంటి వారికి పార్టీలో స్థానం లేదు. అలా ఎవరైనా వర్గాలు మెయింటైన్ చేయాలని అనుకుంటే.. అది వారి మూర్ఖత్వమే అవుతుంది. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలో ప్రోత్సహించం. పార్టీ కోసం పనిచేసిన వాళ్లనే ఆదరిస్తాం.. ఆదుకుంటాం.. నిధులు ఇస్తాం.. కొందరు గిరి గీసుకొని మరీ వర్గాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి అలాంటివి సహించం. బీజేపీలో ఎప్పుడైనా, ఎక్కడైనా మోడీ వర్గం మాత్రమే ఉండాలి. ఇకనుంచి అయినా కొందరు వారి వైఖరి మార్చుకోవాలి’ అని బండి సంజయ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story