- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
48 గంటల్లో ఆ మసీదులన్నీ కూల్చేస్తా.. కట్టలు తెంచుకున్న బండి సంజయ్ కోపం
గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా షేక్‌పేట్‌లో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదు? అని ప్రశ్నించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని కూల్చామని చెప్పిన అధికారులను.. అదే రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఎవరి మెప్పుకోసం మూకుమ్మడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారని అధికారులను నిలదీశారు.
‘‘ఒకటి కాదు.. రెండు కాదు.. గోదావరిఖనిలో 46 మైసమ్మ గుడులను కూల్చేశారు.. 48 గంటల్లో ఆ గుడులను పునర్నిర్మించకపోతే వాళ్ల సంగతి చూస్తా.. జూబ్లీహిల్స్ పోలింగ్ తరువాత నేనే గోదావరిఖని వెళతా.. మసీదులను కూల్చివేయిస్తా.. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపుతానన్న ఒవైసీని సీఎం సంకనేసుకుని తిరుగుతున్నాడు.. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే పార్కులన్నీ ఖబరాస్తన్లు అయితయ్.. మీ ఇండ్ల ముందే రక్తం ఏరులై పారుతుంది. హిందువులు జూబ్లీహిల్స్‌లో ప్రశాంతంగా తిరిగే పరిస్థితి కూడా ఉండదు.. మొలతాడు లేనోడికే అంత పౌరుషం ఉంటే.. మరి మొలతాడు ఉన్న మనకెంత పవర్ ఉండాలి?.. హిందువులారా ఒక్కసారి ఆలోచించండి.. జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపించండి’’ అని బండి సంజయ్ కోరారు. అంతకుముందు గోదావరిఖనిలో ఆలయాల కూల్చివేతపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీకు ఫోన్ చేసి మాట్లాడారు.






