- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పాతబస్తీ మొత్తం ఆలయాలు నిర్మిస్తాం’.. బోనాల వేళ బండి సంజయ్ సంచలన ప్రకటన
బోనాల పండుగ(Bonala Festival) సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సందర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: బోనాల పండుగ(Bonala Festival) సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల పండుగలు వస్తే.. ఆలయాలకు నిధులు అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ(BJP Telangana) అధికారంలోకి రాగానే పాతబస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూలైన్ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో ఆలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.






