- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
A-B-Cతో రాజకీయ లెక్కలు..! అఖిలేశ్ భేటీలపై బండి సంజయ్ మ్యాథమెటిక్స్ ట్వీట్
తెలంగాణ పర్యటనలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను కలవడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పర్యటనలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను కలవడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏ(A) -బీ(B) దగ్గరగా, బీ(B)-సీ(C)కి దగ్గరగా ఉంటే.. ఏ(A)-సీ (C) ఎక్కడ నిలుస్తాయో సమీకరణాలు అవసరం లేదు’ అంటూ మ్యాథమెటిక్స్ ఫార్ములతో బండి సంజయ్ తన ట్వీట్‌ను ప్రారంభించారు. ఈ ఉదాహరణతో ‘ఎవరు ఎవరి బీ (B) టీమ్‌గా పనిచేస్తున్నారో అందరికీ తెలుసు’ అని పేర్కొన్నారు.
వ్యవస్థను వ్యతిరేకిస్తున్నానని చెప్పుకునే రాహుల్ గాంధీ, అదే వ్యవస్థలో భాగమైన వారితో, ముఖ్యంగా ఢిల్లీలో, చేతులు కలుపుతూనే ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బహిరంగంగా బీఆర్ఎస్‌ను ప్రత్యర్థిగా చూపిస్తున్నా, మూసివేసిన గదుల్లో మాత్రం ఇద్దరూ ఒకే సౌకర్యవలయంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఒకే వలయం, ఒకే సౌకర్యం.. కెమెరాల ముందు మాత్రం ప్రత్యర్థులుగా ప్రసంగాలు’ అని తెలిపారు.
అఖిలేశ్ కుమార్ యాదవ్ తెలంగాణ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విడివిడిగా కలసిన సంగతి తెలిసిందే. ఆ భేటీలకు సంబంధించిన ఫోటోలను అఖిలేశ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మ్యాథమెటిక్స్ ఫార్ములతో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీమ్ అనే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ట్వీట్ ఇదే..






