- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం.. రక్షణశాఖ అధికారులకు బండి సంజయ్ ఫోన్
తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల(Army Helicopters) రాక ఆలస్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరా తీశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల(Army Helicopters) రాక ఆలస్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరా తీశారు. ఈ సందర్భంగా రక్షణశాఖ(Defense Department) అధికారులకు ఫోన్ చేశారు. తెలంగాణకు మూడు హెలికాప్టర్లను రెడీ చేశామని ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ అధికారులు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక పోవడంతో బాధిత ప్రాంతాలకు చాపర్ల రాక ఆలస్యమవుతోందని వివరించారు. ప్రత్యామ్నాయ స్టేషన్‌ల నుండి చాపర్లను రప్పించే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు. నాందెడ్, బీదర్ స్టేషన్ల నుండి చాపర్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని ఈ సందర్భంగా వారికి బండి సంజయ్ వివరించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకునే చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమయ్యాయని బండి సంజయ్ తెలిపారు. వీలైనంత తొందరగా చాపర్లను పంపాలని కోరారు.






