ఏం రాశారో కూడా తెలుసుకోలేని అసమర్థుడు.. తుమ్మలపై బండి ఫైర్

by Prasad Jukanti |

రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏం రాశారో కూడా తెలుసుకోలేని అసమర్థుడు.. తుమ్మలపై బండి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హామీలు, రైతు సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి బహిరంగ లేఖ రాశారు. లేఖ రాస్తే ఎదురు దాడి చేయడం సరికాదన్నారు. కళ్లుండి చూడలేని కబోది తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల ఆస్కార్‍కు అర్హులు అంటు ఎద్దేవా చేశారు. ఎంఎస్పీ చట్టం తెస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని సొంత పార్టీ మేనిఫెస్టోలో ఏం రాశారో కూడా తెలుసుకోలేని అసమర్థుడు తుమ్మల నాగేశ్వరరావు అంటూ విరుచుకుపడ్డారు. ఎంఎస్పీ అమలు బాధ్యత రాష్ట్రాలదేనని, ఫసల్ బీమా అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొడుతోంది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఎస్‍డీఆర్ఎఫ్ పేరుతో ఏటా రూ. 400 కోట్లు కేంద్రం ఇస్తోందని ఆ డబ్బు ఏం చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా అని నిలదీశారు. ఎరువులు సరఫరా చేయలేని అసమర్థ మంత్రి తుమ్మల అని కనీస మద్దతు ధర అందించడంతో పాటు ఎరువులు సరఫరా చేయలేని అసమర్థ మంత్రి అన్నారు. ఎంఎస్పీతో పాటు రబీసీజన్‍లో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story