- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ అందరినీ ఒకటే కోరుతున్నా.. పసుపు బోర్డు సభలో బండి సంజయ్ కీలక ప్రసంగం
‘తెలంగాణ ప్రజలారా.. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘తెలంగాణ ప్రజలారా.. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం (Inauguration of the Turmeric Board Office) అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభలో బండి సంజయ్ కుమార్ లేచి మాట్లాడేందుకు సిద్ధమవ్వగానే చప్పట్లతో సభ దద్దరిల్లింది. ప్రజా స్పందనను చూసిన (Amit Shah) అమిత్ షా నవ్వుతూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు.
సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ జిల్లా వాళ్లు గొప్పోళ్లు. మీరు కొట్లాడి సాధించుకున్నరు. మీరంతా లేచి అమిత్ షాకు ధన్యవాదాలు తెలపాలని కోరుతూ చప్పట్లు కొట్టండి (అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు). ఇందరూ రైతులు హీరోలు. మీరు చేసిన ఉద్యమాలు మామూలు కాదు. అరవింద్‌ను అంతా పసుపు అరవింద్ అంటున్నారు. మాది రైతు ప్రభుత్వం. రైతును రాజును చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కార్ నినాదం. తెలంగాణ ప్రజలారా.. మీ అందరినీ ఒకటే కోరుతున్నా.. అందరికీ ఇచ్చారు అవకాశం.. బీజేపీకి ఇవ్వండి అధికారం’ అని వ్యాఖ్యానించారు.






