- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీని గెలిపిస్తే ఎవరు అడ్డొచ్చినా మళ్లీ నిర్మిస్తాం.. జూబ్లీహిల్స్ ప్రజలకు బండి సంజయ్ కీలక హామీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అంటే అద్దాల మేడలు అనుకుంటారు.. కానీ బస్తీలతో నిండిన జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ గాలికొదిలేశాయని ఆరోపించారు. మొన్న బీఆర్ఎస్‌పై కోపంతో కాంగ్రెస్‌కు ఓటు వేశారు.. ఇప్పుడు కాంగ్రెస్‌పై కోపంతో మళ్లీ బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. ఎంఐఎంకు జూబ్లీహిల్స్‌లో పోటీచేసే దమ్ములేదా? అని ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లో పెద్దమ్మగుడి(Peddamma Thalli Temple)ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చింది.. జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపిస్తే గుడిని నిర్మిస్తామని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు, బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది. ఇవాళ్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది.






