‘మీరు లేకపోతే నేను కరీంనగర్‌కే పరిమితమయ్యేవాడిని’.. బండి సంజయ్ ఎమోషనల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-21 13:53:28  IST  )

జర్నలిజం(Journalism) అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్‌

‘మీరు లేకపోతే నేను కరీంనగర్‌కే పరిమితమయ్యేవాడిని’.. బండి సంజయ్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిజం(Journalism) అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీరివల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను కచ్చితంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి(CM Revanth Reddy)కి లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతోపాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు సమాజంలో జర్నలిస్టులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


ఈరోజు సాయంత్రం వేములవాడకు వచ్చిన బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ (ఐజేయూ)ను సందర్శించారు. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేశారు. ఆ నిధులతోపాటు దాతల సాయంతో నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఈస్థాయికి రావడానికి కారణం మీడియానే అని అన్నారు. ప్రజల కోసం తాను చేసిన ఉద్యమాలను, కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లనే నాకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. మీడియా సహకారం లేకపోతే నేను కరీంనగర్‌కే పరిమితమయ్యేవాడిని. గత ఐదేళ్లలో బీజేపీ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. మీడియా యాజమాన్యాలు తొలుత బీజేపీ ఉద్యమాలకు విస్త్రత ప్రచారం కల్పించినప్పటికీ, తీరా ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ కాంగ్రెస్‌కు ప్రాధాన్యతనివ్వడంతో ఆ పార్టీయే అధికారంలోకి రాగలిగిందని బండి సంజయ్ అన్నారు.

ఏ ఉద్యమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా కాంగ్రెస్‌కు అధికారం లభించడంతో ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. గత 17 నెలలుగా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రజల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్లయింది. జర్నలిస్టుల జీవితాలు కూడా దుర్బరంగా మారాయి. హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు కలగానే మారాయి. ఇటీవల కాలంలో యూట్యూబ్ ముసుగులో జర్నలిజం అనుభవం లేని జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. వీరివల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డపేరు వస్తోంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతోపాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇస్తున్నా. దీంతోపాటు సమాజంలో జర్నలిస్టులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

వేములవాడ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది కచ్చితంగా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని కీలక ప్రకటన చేశారు. వేములవాడ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మరో రూ.10 లక్షల సాయం అందించాలని కోరుతూ ప్రెస్ క్లబ్ నిర్వాహకులు బండి సంజయ్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పనిసరిగా తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో తాను ముందుంటానని భరోసా ఇచ్చారు.

Next Story