- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ నాస్తికుడు: బండి సంజయ్
by GSrikanth |
బీఆర్ఎస్ నేతలపై బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి రెచ్చిపోయారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి రెచ్చిపోయారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజాహిత యాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని విమర్శించారు. బండి సంజయ్ బరాబర్ హిందువే అని స్పష్టం చేశారు. హిందూ ధర్మం గురించి చెప్పడంలో తాను ఏనాడూ వెనకడుగు వేయబోనని అన్నారు. కానీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ దేవుడి నమ్మరని.. ఆయన ఓ నాస్తికుడు అని బండి సంజయ్ ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోడానికి కారణం 100 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. కాళేశ్వరంలో వినోద్ కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లు కాదా? అని ప్రశ్నించారు.
Next Story






