- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టమే.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) నివాళ్లు అర్పించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) నివాళ్లు అర్పించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘మహాత్ములకు నివాళులు అర్పించడమంటే వారి జయంతి, వర్దంతిలను ఘనంగా నిర్వహించుకోవడమే కాదు. వారి ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తుంచుకోవాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్.. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం.. మహాత్మా జ్యోతిరావు పూలే. ఏ సమాజమైతే చదువు పరంగా, ఆర్థికంగా ఎదుగుతుందో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని ఆశించిడమే కాకుండా అందుకోసం చివరిదాకా కృషి చేసిన మహనీయుడు ఫూలే. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అభిమానించే జ్యోతిరావు పూలె కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేశారు. ఆరోజుల్లోనే వితంతు పునర్వివాహాలు జరపడంతోపాటు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మహిళల చదువు కోసం నిరంతరం పాటుపడ్డారు.
‘‘దీనబంధు’’ అనే పత్రికను స్థాపించి బీదల, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు. అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి, పేదలను ఆదుకోవడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతుడు జ్యోతిబా పూలె. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పూలెను గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుంది. సతీమణి సావిత్రీబాయి పూలెతో కలిసి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి ఆనాడే ఏకంగా 52 పాఠశాలలను ప్రారంభించి వేలాది మంది పేదలకు అక్షర జ్ఝానాన్ని అందించిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే. స్వాతంత్య్రంరాని రోజుల్లోనే నిర్బంధాలను, అణిచివేతలను తట్టుకుంటూ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు జ్యోతిరావు చేసిన కృషి చిరస్మరణీయం.
మన దురదృష్టమేమిటంటే.. జ్యోతిరావు పూలే ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన(Congress Govt) సాగుతోంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటే నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలనా పుణ్యమా అని రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారు. ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ విమర్శించారు.






