ఉగాది వేళ మజ్లిస్ పార్టీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

ఉగాది(Ugadi) పండుగపూట కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు.

ఉగాది వేళ మజ్లిస్ పార్టీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది(Ugadi) పండుగపూట కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరికీ సమృద్ధిగా ఆదాయం పెరగాలి. సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని అన్నారు. మోడీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువైతాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రభలుతుందని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. అయితే కాంగ్రెస్ పాలనను గమనిస్తే జ్యోతిష్య పండితులు చెప్పేది నిజమేనన్పిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’ సోకింది. కాంట్రాక్టుల దగ్గర నుండి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ‘పింక్ వైరస్’(Pink Virus) సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారు. బీజేపీ చేసిన పోరాటాల వల్ల పింక్ వైరస్ పీడ విరిగింది. కొత్తగా కాంగ్రెస్ రూపంలో మరో వైరస్ సోకిందని మండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటాలనే వ్యాక్సిన్‌గా కాంగ్రెస్ అవినీతిపై యుద్దం చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న సన్నబియ్యం పంపిణీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తోందని చెప్పారు. ఒక్కో కిలోకు రూ.40లు మోడీ సర్కారే(Modi Govt) చెల్లిస్తోంది. సన్న బియ్యంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం రూ.10 మాత్రమే అని అన్నారు. రాష్ట్ర సర్కార్ చేసే ఖర్చు కంటే మూడు రెట్లు అదనంగా మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వెంటనే రేషన్ షాపులతోపాటు అంతటా ప్రధాని ఫోటోలు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)ను పూర్తిగా నీరుగారుస్తున్నారు. శ్రవణ్ రావుసహా అందరికీ బెయిల్ వచ్చేలా చేసి కాంగ్రెస్సే సహకరిస్తోంది. గత ఎలక్షన్ ముందు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడుతోంది. అందుకే ఏడాదిన్నరైనా అరెస్ట్ కాదు కదా... కనీసం నోటీసులిచ్చి విచారణ కూడా చేయడం లేదు. ప్రజలను దారి మళ్లించడానికి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నాయి. దేశాన్ని విభజిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు అవాకులు పేలుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్(MIM) పార్టీలూ మూడు కుమ్మక్కైనయ్. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటూ మజ్లిస్‌ను గెలిపించేందుకు సిద్ధమయ్యాయని హాట్ కామెంట్స్ చేశారు. మరి కొద్దిరోజుల్లో ఆ మూడు పార్టీల అసలు రంగు బయటపడనుందని అన్నారు.

బీఆర్ఎస్‌(BRS)కు అత్యధిక మంది కార్పొరేటర్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి సరిపడా బలం లేకపోయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలను తీసుకున్నాం.. అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదం పొందడం తథ్యమని అన్నారు. మజ్లిస్‌కు తెలంగాణ అంతటా పోటీ చేసే దమ్మే లేదు.. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అమ్ముడుపోయే పార్టీ మజ్లిస్.. ఓవైసీ కుటుంబ వ్యాపారాలను కాపాడుకునేందుకు ఏ పార్టీకైనా కొమ్ముకాసే తత్వం మజ్లిస్‌ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story