‘ఇది మామూలు విజయం కాదు’.. మల్క కొమురయ్యకు బండి సంజయ్ విషెస్

by Gantepaka Srikanth |

కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమురయ్య(Malka Komaraiah)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలిపారు.

‘ఇది మామూలు విజయం కాదు’.. మల్క కొమురయ్యకు బండి సంజయ్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమురయ్య(Malka Komaraiah)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం అభ్యర్థి మల్క కొమురయ్యతో కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు. ఇది మామూలు విజయం కాదు.. మల్క కొమురయ్య ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. మోడీ మీదున్న నమ్మకమే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలు వేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం మల్క కొమురయ్య కృషి చేస్తారు.. ఇది నా హామీ అని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) చిన్నది కాదు.. తపస్ చిన్న సంస్థ అని మాట్లాడిన అందరి చెంప చెల్లుమనేలా ఉపాధ్యాయులు తీర్పు ఇచ్చారని అన్నారు. కొమురయ్య విజయానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ సెల్యూట్ చేశారు. ఉపాధ్యాయులు కొమురయ్య మీద పెట్టుకున్న విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారని అన్నారు. ఈ విజయాన్ని ఉపాధ్యాయులకు, నరేంద్ర మోడీకి అంకితం చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటైనా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా గెలిపించారని కొనియాడారు. ఇదే ఊపులో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు.

Next Story