- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ-బీజేపీకి మరో బిగ్ షాక్.. కరీంనగర్‌లో బండి సంజయ్ ఓటమి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తప్పక గెలుస్తారనుకున్న కీలక నేతలు ఓటమి పాలు అవుతుండగా.. ఎవరూ

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తప్పక గెలుస్తారనుకున్న కీలక నేతలు ఓటమి పాలు అవుతుండగా.. ఎవరూ ఊహించని స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందుతున్నారు. దుబ్బాకలో రఘునందన్ రావు, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్ అర్వింద్ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సైతం ఓడిపోయారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బండి ఓటమి పాలయ్యారు. స్వల్ప ఓట్ల తేడాతోనే బండి ఓడిపోవడంతో.. రీ కౌంటింగ్ నిర్వహించాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Next Story






