- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కేసు కంటే.. టీవీ సీరియల్స్ త్వరగా అయిపోయాయి: బండి సంజయ్
ఆ కేసు కంటే.. టీవీ సీరియల్స్ త్వరగా అయిపోయాయి: బండి సంజయ్

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్అన్నారు. తనతోపాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో పాటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆఖరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు, దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అనేది అనుమానంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ కూడా అయిపోయాయే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా సాగుతుందని ఎద్దేవా చేశారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలని, బడా పారిశ్రామికవేత్తలను, లీడర్లను, వ్యాపారాలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు చేసిన వ్యవహారంపైనా నిగ్గు తేల్చాలని డిమాండ్‌చేశారు.ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.






