‘ఆ విషయం బయటపెడితే నీ పరిస్థితి ఏంటో’.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

by Gantepaka Srikanth |

కేటీఆర్(KTR) పరువునష్టం దావా నోటీసుల వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు.

‘ఆ విషయం బయటపెడితే నీ పరిస్థితి ఏంటో’.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR) పరువునష్టం దావా నోటీసుల వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘అధికారం ఉందని చేయాల్సిన ఇల్లీగల్ పనులన్నీ చేశారు. తిరిగి నాకే లీగల్ నోటీసులు ఇస్తామని మాట్లాడటానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి. లీగల్ నోటీసుల పేరుతో కేటీఆర్ దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే ప్రయత్నించి విఫలం అయ్యారు. కేటీఆర్ కోతి చేష్టలకు తాను లొంగే వ్యక్తిని కాదు. రాఖీకి ముందు చెల్లెలి నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. నాకు కేటీఆర్ గడువు ఇవ్వడం కాదు.. నీ చీకటి రహస్యాలు బయటపెడితే దాక్కోవడానికి చోటు కూడా మిగలదు’ అని బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కాగా, అంతకుముందు ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల్లో నిజం ఉంటే నిరూపించాలని సంజయ్‌కు కేటీఆర్ సవాల్‌ విసిరారు. లేదంటే 48 గంటల్లో వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే లీగల్‌ నోటీసులు పంపుతానని హెచ్చరించారు.

Next Story