- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్ములేదు అని చెప్పు చాలు.. మిగతాదంతా నేను చూసుకుంటా: సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మున్సిపాలిటీలకు నిధులివ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారని అన్నారు. ఇంటెలిజెన్స్, సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమనే ఫస్ట్రేషన్‌తో బీజేపీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌పై కోపంతో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే.. రెండేళ్లలో కాంగ్రెస్ బండారం బయటపడిందన్నారు. ఆ పార్టీ సంగతి అర్ధమైంది కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారని చెప్పారు. ఈ విషయం తెలిసే సీఎం ఫస్ట్రేషన్‌కు లోనై బీజేపీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఒవైసీని తాను దేవుడిలా తలుస్తున్నట్లు సీఎం చెప్పడంపై తనదైన శైలిలో బదులిచ్చారు. ‘సీఎం, ఒవైసీ మాట్లాడుతున్న స్క్రిప్ట్ ఒకటే. మొన్న ఒవైసీ కరీంనగర్ వచ్చి బండి సంజయ్‌కు తన భార్య కంటే నన్నే ఎక్కువ ఇష్టపడతారని చెప్పారు. ఇవాళ సీఎం కూడా బండి సంజయ్ ఒవైసీని దేవుడిలా చూస్తారని చెప్పారు. బహుశా ఇద్దరి స్ర్కిప్ట్ దారుస్సలాంలోనో లేక గాంధీభవన్‌లో ప్రిపేర్ అవుతున్నట్లుంది. అందుకే ఇద్దరూ ఒక్కటే మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీఎం తన చేతగానితనాన్ని ఇతరులపై నెట్టడం అలవాటైందని ఎద్దేవా చేశారు. ‘‘సుప్రీంకోర్టులో సరైన వాదనలు విన్పించే దమ్ములేదు. సీఎంగా రేవంత్ ఉండగానే కదా ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయింది. మరి పారిపోతుంటే ఏం చేశారు? తప్పించుకోవడానికి ఇవన్నీ డ్రామాలాడుతున్నారు. సీఎంను అడుగుతున్నా.. ‘‘నాకు చేతగాదు, నాకు ఆవేశం లేదు. రోషం, పౌరుషం లేదని, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము అసలే లేదని కేంద్రానికి లేఖ రాయండి. అప్పుడు మేం ఏం చేస్తారో మీరే చూస్తారు.’’అని బదులిచ్చారు.






