- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: గోమాత మత విశ్వాసం కాదు : కేంద్ర మండి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కాదని, గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కాదని, గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాంలోనూ కొందరు మత పెద్దలు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసిన దృశ్యాలను తాను చూశానని పేర్కొన్నారు. ఆదివారం నారాయణగూడ కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు, తెలంగాణ గో సేవా విభాగం ఆధ్వర్యంలో గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఝానం’’పై రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించారు. విజేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాలు, పట్టాణాల్లోకే కాకుండా గ్రామాల్లోకి కూడా పాల ప్యాకెట్లు, పాల పౌడర్ డబ్బాలు, ప్యాకేజ్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. నూటికి 90 శాతం మంది వాటిపైనే ఆధారపడి జీవించే పరిస్థితిలోకి వచ్చారని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తినే తిండి, తాగే నీళ్ల వరకు అన్నీ కలుషితం అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం, మన జీవన విధానాన్ని మర్చిపోయి విదేశీ సంస్కృతి, జీవన విధానానికి అలవాటు పడటమే ప్రధాన కారణం. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మన భవిష్యత్ తరాల మనుగడే ప్రమాదంలోకి వెళ్లే అవకాశముంది. భారతీయ మూలాలపై నేటి తరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గోవు పేడ పొలాలకు ఎరువుగా పనిచేసి నేల సారాన్ని పెంచుతుందన్నారు. బయో గ్యాస్ తయారీకి ఉపయోగపడుతుంది. పిడకలు కాల్చినప్పుడు వాయు కాలుష్యం తగ్గుతుంది. పేడతో ఇళ్లు పూయడం వలన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. గోమూత్రం అనేక వైరస్‌లను చంపే గుణాలు కలిగి ఉందన్నారు. ప్రభుత్వాలు గోమాత పేరుతో పథకాలు ప్రకటిస్తాయని అవి కాగితాలకే పరిమితమైందని, కొందరైతే గోమాత సంరక్షణను కేవలం మతపరమైన అంశంగా చూస్తున్నారు. గోవును కోల్పోతే ఏమవుతుందో కూడా ఆలోచించడం లేదు. గోవు లేకపోవడంతో రైతులు రసాయన ఎరువులకు బానిసలయ్యారు. భూమాతను, సమస్త ప్రకృతిని కాపాడే గోమాతను విస్మరించి రోడ్డు పాల్జేయడం అంతకంటే ఘోరం ఉండదన్నారు. గోవులను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ మిషన్ అన్ నాచురల్ ఫామింగ్, లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ , నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ లాంటి పథకాలతో గోవుల సంతతి పెరిగేటట్లుగా చేస్తుందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులపై సున్నా శాతం జీఎస్టీ విధించినట్లు పేర్కొన్నారు.






