పర్మిషన్ అడగలేదా..? ఇదిగో సాక్ష్యం: బండి సంజయ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-06 10:02:45  IST  )

బోరబండ(Borabanda)లో రోడ్ షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు.

పర్మిషన్ అడగలేదా..? ఇదిగో సాక్ష్యం: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బోరబండ(Borabanda)లో రోడ్ షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన కాపీని, అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. తమాషా చేస్తున్నారా? అంటూ పోలీసులపై రెచ్చిపోయారు. రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? అని మండిపడ్డారు. బోరబండలో బీజేపీ తడాఖా ఏంటో చూపిస్తాం.. బీజేపీ శ్రేణులారా.. బోరబండకు భారీగా తరలిరండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సైతం ప్రచారం స్పీడ్‌ పెంచాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరబండలో ఎన్నికల ప్రచారంను నిర్వహించడానికి పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. దీనికి తొలుత ఓకే చెప్పిన పోలీసులు ఆ తర్వాత అనూహ్యంగా అనుమతి నిరాకరించారు. దీనిపై బండి సంజయ్ మండిపడుతున్నారు.


Read More... బోరబండకు వస్తున్నా.. ఎవరు ఆపుతారో చూస్తా: పోలీసులకు బండి సంజయ్ వార్నింగ్

Next Story