బోరబండకు వస్తున్నా.. ఎవరు ఆపుతారో చూస్తా: పోలీసులకు బండి సంజయ్ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-06 10:01:44  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

బోరబండకు వస్తున్నా.. ఎవరు ఆపుతారో చూస్తా: పోలీసులకు బండి సంజయ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ (BJP) ఆధ్వర్యంలో బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లుగానే ఇచ్చి ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోరబండ (Borabanda) సభకు అనుమతిని ఇవ్వకపోవడంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోరబండకు తాను వస్తున్నానని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు. ఇలాంటి నిర్బంధాలు, అడ్డంకులను బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడిందని కామెంట్ చేశారు. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలంతా సాయంత్రం బోరబండకు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ దమ్మేందో ప్రభుత్వానికి చూపించాలని బండి సంజయ్ కాషాయ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read More... పర్మిషన్ అడగలేదా..? ఇదిగో సాక్ష్యం: బండి సంజయ్

Next Story