- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దేశం గర్వపడే సమయం’.. దివ్య దేశ్‌ముఖ్‌కు బండి సంజయ్ శుభాకాంక్షలు
ఫిడే (FIDE) ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫిడే (FIDE) ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇది దేశం గర్వపడే సమయం. ఇంతటి గొప్ప విజయం సాధించిన దివ్య దేశ్‌ముఖ్‌కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇది ఆమె కృషి, పోరాటానికి దక్కిన గౌరవం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీ(Koneru Humpy)పై దివ్య విజయం సాధించారు. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించడం ఆసక్తిగా మారింది.






