- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని మోడీపై బెదిరింపు నినాదాలు: బండి సంజయ్ ఫైర్
కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీపై బెదిరింపుల నినాదాలు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీపై బెదిరింపుల నినాదాలు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. దేశ భద్రత, గౌరవం, అభివృద్ధి కోసం ప్రధాని మోడీ రాత్రింబవళ్లు కష్టపడుతుంటే.. కాంగ్రెస్ మాత్రం వీధి స్థాయి బెదిరింపులు, దుర్భాషల నినాదాలకు దిగజారుతోందని విమర్శించారు. ‘మోడీ తెరీ ఖబర్ ఖుదేగీ’ Modi teri khabar khudegi వంటి నినాదాలు అల్లరి మూకల భాషకు నిదర్శనమని, ముసుగు తొలగినప్పుడు కాంగ్రెస్ అసలు ముఖం కూడా అదేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అలాగే ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ట్వీట్ ఇదే..
Next Story






