పవన్ సినిమాకు బీజేపీ ఫుల్ సపోర్ట్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-23 11:22:00  IST  )

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా ఈనెల 24న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

పవన్ సినిమాకు బీజేపీ ఫుల్ సపోర్ట్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా ఈనెల 24న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే పవన్ డిప్యూటీ సీఎం కావడంతో ఈ సినిమాపై ప‌లువురు రాజ‌కీయనాయ‌కులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన నేతలే కాకుండా తెలంగాణ బీజేపీ నేతలు సైతం పవన్ సినిమాపై పోస్టులు పెడుతున్నారు.

తాజాగా కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ హరిహరవీరమల్లుపై ట్విట్టర్ వేధికగా స్పదించారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రజల కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టే హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా ఆయ‌న ప్ర‌యాణంలో మ‌రో గొప్ప మైలురాయిగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జాసేవ నుండి ప్ర‌తిభావంత‌మైన న‌ట‌న వ‌ర‌కు ఆయ‌న అంకిత భావాన్ని చూపిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వాల‌ని కోరుకున్నారు.

Also Read: ‘హరిహర వీరమల్లు’ పెద్ద హిట్ అవ్వాలి: వైసీపీ ముఖ్య నేత పాజిటివ్ కామెంట్స్

Next Story