- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది అర్బన్ నక్సల్స్ రిపోర్ట్.. విద్యా కమిషన్ సిఫార్సులపై బండి ఫైర్
తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సులపై (Telangana Education Commission Recommendations) కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. 'గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః..' అంటూ గురువులకు గౌరవం ఇవ్వాలని మన సంస్కృతి మనకు నేర్పుతుంటే తెలంగాణ విద్యా కమిషన్ మాత్రం తెలంగాణ ఉపాధ్యాయ సమాజాన్ని అవమానించే సిఫార్సులు చేసిందని మండిపడ్డారు. మన సమాజంలో గురువుల పాత్ర, మన నాగరిక విలువలకు గౌరవం తెలియని అర్బన్ నక్సల్స్ తయారు చేసిన నివేదికల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ నివేదికను తిరస్కరించి తెలంగాణ ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని లేదా ఈ సిఫార్సులు సరైనవే అని ప్రభుత్వం భావిస్తే వాటిని అమలు చేసి ఎన్నికలు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఉపాధ్యాయులు తమ తీర్పు ఏమిటో చెబుతారన్నారు. గురువులను గౌరవించుకోవాల్సిన చోట ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలి, పదోన్నతులు (Promotions) నిలిపివేయాలి, ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఇవాళ పోస్టు చేశారు.






