ఆ మంత్రి ఓడిపోతాడని కేసీఆర్‌కు ఎప్పుడో తెలుసు: బండి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ఆ మంత్రి ఓడిపోతాడని కేసీఆర్‌కు ఎప్పుడో తెలుసు: బండి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి గంగుల కమలాకర్ యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు ఓటుకు రూ. 10 వేలు పంచేందుకు గంగుల సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. గంగుల కమలాకర్ మళ్లీ గెలిస్తే జీతాలు, పెన్షన్లు రావని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎప్పుడో తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై గంగుల కుట్ర చేసి జైలుకు పంపారని బండి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూకబ్జాలు, అతినీతి లొల్లి.. ఇసుక కుప్పలు కనిపిస్తే చాలు బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు.



Next Story

Most Viewed