సంతోషంగా ఉంది.. BRS ఓటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |

బీఆర్ఎస్ ఓటమిపై ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.

సంతోషంగా ఉంది.. BRS ఓటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఓటమిపై ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఓడిపోవడం సంతోషంగా ఉందని.. అవినీతి పాలనను ప్రజలు అంతిమొందిచారన్నారు. బీజేపీ కార్యకర్తలను చాలా కష్టాలు పెట్టారని.. ఇప్పుడు మా కష్టానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌లు చేసి హింసించారని మండిపడ్డారు. కరీంనగర్‌లో నన్ను ఓడించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుని ఓడించిందని చెప్పారు. తెలంగాణలో మేం పోరాటం చేస్తే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఇక, కరీంనగర్ నుండి బీజేపీ తరుఫున బరిలోకి దిగిన బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Next Story