- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాముడి వారసులు కావాలా? ఔరంగజేబు వారుసులు కావాలా? జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోండి: బండి సంజయ్
మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సునీత, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills bypoll) ఎన్నికల్లో రాముడి వారుసులుగా మేము వస్తుంటే ఔరంగజేబు వారసులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తున్నారని.. రాముడి వారసులు కావాలా? ఔరంగజేబు వారసులు కావాలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బైపోల్‍లో శ్రీరాముడి దమ్మేంటో, హిందూ ఓటు బ్యాంకు దమ్మెంటో చూపించాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింల గురించి ఓ వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతుంటే హిందువులంతా చేతులు కట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‍లు కేవలం ముస్లింఓటర్లకే డబ్బులు పంచుతూ కనీసం హిందువుల ఇండ్లకు వెళ్లి కనీసం వారీ బాధలు కూడా వినడం లేదని ఆరోపించారు. బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ అని మరోసారి బల్లగుద్ది చెబుతున్నామన్నారు.
సునీత, కేటీఆర్ కుట్ర:
మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సునీత, కేటీఆర్ (KTR) కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తాను అమెరికా నుంచి రావొద్దని బెదిరించారని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడి ఆరోపించారని అన్నారు. మాగంటి సునీతకు హైదర్ గూడలో మనోహర్ అనే భర్త పేరుతో ఓ ఓటర్ కార్డు ఉందని అలా ఉండగా జూబ్లీహిల్స్ లో తాజాగా దివంగత మాగంటి గోపీనాథ్ భార్యను అంటూ మరో ఐడీ కార్డు తీసుకున్నారని ఆరోపించారు. ఈ మనోహర్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు గోపీనాథ్ మరణం, ఆస్తులపై విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు పింపించానని చెప్పారు.
తడిబట్టలతో ప్రమాణం చేయ్..
కేసీఆర్ పేరు చెప్పి గెలిచిన కేటీఆర్ నా గురించి మాట్లాడుతావా అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తాను డ్రగ్స్ తీసుకోలేదు అనే విషయాన్ని ఇవాళ సాయంత్రం లోపు తన తల్లిదండ్రులు భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కేటీఆర్ తడిబట్టలతో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ ప్రమాణం చేయకుంటే కేటీఆర్ నీచుడిలెక్కనన్నారు. డ్రగ్స్ విషయంలో శాంపిల్స్ కోసం వెంట్రుకలు అడిగితే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాక వెంట్రుకలు ఇస్తానన్న నువ్వా నా గురించి మాట్లాడుతారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జుబ్లీహిల్స్ అంటే డ్రగ్స్ అనే పరిస్థితి తీసుకువచ్చిందే కేటీఆర్ అని ఆరోపించారు.
రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్:
తెలంగాణలో 2034 వరకు మాదే అధికారం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయ్యాయి. రాబోయే మూడేళ్లు అధికారంలో ఉండే చాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరో దింపాల్సిన పని లేదని వాళ్లకు వాళ్లే తన్నుకుంటారని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రే ఒప్పుకుంటున్నారు. అందుకే ఇక్కడ బీజేపీకి ఓట్లు వేయమని సీఎం చెప్పాలి. మేము గెలిస్తే కిషన్ రెడ్డి, నేను మోడీ వద్దకు వెళ్లి నిధులు తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని మొదట సీఎం రేవంత్ రెడ్డే అన్నారు. నేను అప్పటి వరకు హిందుత్వం గురించి మాట్లాడలేదన్నారు. జూబ్లీహిల్స్ లో సర్వేలు మొత్తం తారుమారు కాబోతున్నాయన్నారు.
READ MORE .....
HYD: బండి సంజయ్ ఫినిషింగ్ టచ్.. ‘హైదరాబాద్ ఫైల్స్’ అంటూ షాకింగ్ కామెంట్స్






