- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆట మొదలైంది.. ఇక చూసుకుందాం’: కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఆట మొదలైంది. ఇక చూసుకుందాం. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. నిజం ఒక సింహం.. దాన్ని కాపాడితే, అది మనల్ని రక్షించుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్థులు త్వరలోనే బయటపడతారు’ అని బండి సంజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ అసత్యాలు మాట్లాడారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే తనకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే క్రిమినల్ చర్యలకు బండి సంజయ్ బాధ్యులు అవుతారని కేటీఆర్ హెచ్చరించారు.






