‘కేటీఆర్‌లా పరువునష్టం దావాలు నేను వేయను’.. బండి సంజయ్ కౌంటర్

by Gantepaka Srikanth |

కేటీఆర్(KTR) పరువునష్టం దావాపై బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు.

‘కేటీఆర్‌లా పరువునష్టం దావాలు నేను వేయను’.. బండి సంజయ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR) పరువునష్టం దావాపై బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. పరువునష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు. కేటీఆర్‌లా తాను ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలు చేయను.. ఇలా పరుపునష్టం దావా(Defamation Lawsuit)లు వేయబోను అని కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటానని అన్నారు. ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ నిరాధార వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కేటీఆర్‌ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. తనకు బహిరంగ క్షమాపణతో పాటు రూ.10 కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత డిసెంబర్‌ 15న ఈ కేసు విచారణకు హాజరు కావాలని బండి సంజయ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.

Next Story