- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రతా బలగాల పోరాటానికి హ్యాట్సాఫ్.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన బండి సంజయ్
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పాల్గొన్న భద్రతా బలగాల పోరాటానికి హ్యాట్సాఫ్.. కొన్నేళ్లుగా భారతదేశ వికాసానికి అడ్డుతగులుతున్న నక్సలిజంపై చేస్తున్న పోరులో కీలక విజయం ఇది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ప్రధాని మోదీ సంకల్పానికి ఈ విజయం ఒక నిదర్శనం. మోడీ, అమిత్ షాలు ఇద్దరూ అలుపెరుగని ప్రయత్నాలతో భద్రతా బలగాలతో గొప్ప పోరాటాన్ని రేయింబవళ్ళు చేయించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు సహా మొత్తం 27 మంది మృతిచెందారు.
గత మూడు దశాబ్దాల కాలంలో జనరల్ సెక్రటరీ స్థాయి మావోయిస్టు నేతను ఎన్‌కౌంటర్ చేయడం ఇదే తొలిసారి. మావోల మీద భారత్ చేస్తున్న యుద్ధంలో ఇది అతి పెద్ద విజయం. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఫలితంగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలలో ఇప్పటికే 54 మంది అరెస్టు కాగా.. మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జాతీయ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క భద్రతా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నిజంగా నవ భారత్ లక్ష్యం దిశగా అడుగులు పడటమే.. భారత వికాసానికి అడ్డు తగిలే ఏ దుశ్చర్యను ఉపేక్షించని నయా భారత్ ఇది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
“ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” క్రతువులో పాల్గొన్న మన భద్రత బలగాల పోరాటానికి హ్యాట్సాఫ్..
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 21, 2025
కొన్నేళ్లుగా భారతదేశ వికాసానికి అడ్డుతగులుతున్న నక్సలిజంపై చేస్తున్న పోరులో కీలక విజయం ఇది.
2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే మన ప్రియతమ ప్రధాని మోదీజీ సంకల్పానికి ఈ…






