- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చట్టంపై గౌరవంతో అప్పగించా : భగీరథ్ సరెండర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందన
పోక్సో కేసులో కుమారుడు భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికను వేధించడంతో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎట్టకేలక బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో హైడ్రామాకు తెరపడింది. కుమారుడి లొంగుబాటుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తమ కుమారుడు భగీరథ్‌ను లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే కుమారుడిని పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.
తప్పేమీ చేయలేదు.. ఆధారాల కోసమే జాప్యం
తన కుమారుడి లొంగుబాటుపై బండి సంజయ్ మాట్లాడుతూ.. భగీరథ్ తాను ఎలాంటి తప్పూ చేయలేదని చెబుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తాము నిర్దోషులమని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలను సేకరించే క్రమంలోనే పోలీసులకు అప్పగించడంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు. అంతేకాని చట్టం నుండి తప్పించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, అందుకే ఇప్పటివరకు లొంగిపోకుండా సరైన ఆధారాలతో లాయర్ల ద్వారా పోలీసుల ముందుకు వచ్చామని తెలిపారు. కుమారుడిని చట్టం ముందు ప్రవేశపెట్టిన అనంతరం, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, న్యాయస్థానాల్లో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ లొంగుబాటుతో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడగా, పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.






