- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ 'గాయబ్' ట్వీట్‌పై బండి సంజయ్ రియాక్షన్
పహల్గామ్ ఘటనను ఉద్దేశించి.. సమాధానం చెప్పాల్సిన సమయంలో ప్రధానమంత్రి మాయం అయ్యారు అంటూ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఓ ట్వీట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఘటనను ఉద్దేశించి.. సమాధానం చెప్పాల్సిన సమయంలో ప్రధానమంత్రి మాయం అయ్యారు అంటూ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సంచలనంగా మారడంతో పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఉగ్రదాడి తరవాత మోడీ తదుపరి కార్యాచరణ చెప్పకపోవడం పట్ల విమర్శలు చేయడం సరైనదే అని కాంగ్రెస్ నేతలు సమర్దిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేధికగా స్పందించారు.
బాధ్యత గురించి అత్యంత బాధ్యతారాహిత్యమైన ట్వీట్ అంటూ పేర్కొన్నారు. భారత్ దుఃఖిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎగతాలి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఒకవైపు రాహుల్ జాతీయవాదం అంటుంటే మరోవైపు కాంగ్రెస్ ఇస్లామాబాద్ సంగీతానికి డ్యాన్స్ చేస్తోందని విమర్శించారు. ప్రతి భారతీయుడు ఐక్యంగా నిలబడినప్పుడు కాంగ్రెస్ విభజనకు, అవమానానికి, ప్రమాదానికి గురవుతోందని పేర్కొన్నారు. సొంతదేశంతో నిలబడలేని పార్టీకి ఆ దేశం నమ్మకాన్ని కోరే హక్కు లేదని విమర్శించారు. ఇది రాజకీయ దివాలా కాదని జాతీయ ద్రోహం అని మండిపడ్డారు. ముసుగు తొలగింపోయింది, శత్రువు బయటపడ్డాడు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.






