T BJP: బీజేపీ కొత్త వ్యూహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కు చెక్ పెట్టేనా?

by Prasad Jukanti |

హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కమలం పార్టీ వేస్తున్న ప్లాన్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

T BJP:  బీజేపీ కొత్త వ్యూహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కు చెక్ పెట్టేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ (T BJP) వేస్తున్న అడుగులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తమకు బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దిగడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ పోరుకు దూరంగా ఉంటే ఈ పోరులో తమ అభ్యర్థిని నిలపడమే కాకుండా గెలుపు విషయంలో కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ పక్కా ప్లాన్ రెడీ చేసిందా అనే చర్చ జరుగుతోంది.

హిందుత్వా వర్సెస్ ఎంఐఎం:

ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిగలో సత్తా చాటిన బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల (Hyderabad local MLC election) బరిలోనూ నిలిచింది. ఇక్కడ ఎంఐఎం తమ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీని బరిలోకి దింపగా ఆయనకు పోటీగా బీజేపీ గౌతమ్ రావును సెట్ చేసింది. మజ్లీస్ అరాచకాలను అడ్డుకునేందుకే తమ అభ్యర్థిని బరిలోకి దింపామని బీజేపీ చెబుతోంది. ఈ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూం ఏంటో ప్రజలు తెలిసిపోతుందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) చెబుతుంటే ఈ ఎన్నికను హిందుత్వా వర్సెస్ ఎంఐఎం గా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీ అధినాయకుల మాట విని ఎంఐఎంకు ఓటు వేస్తే ఆ తర్వాత మీ డివిజన్లలో తిరగలరా అని సంచలన వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ టెంపోను మరింత పెంచుతోంది. ఒక వేళ మీరు ఎంఐఎంకు ఓటు వేస్తే హిందూ యువత అంతా మీకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసి వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పక్కాగా ఓడిస్తారని బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక అంశం హిందుత్వా వర్సెస్ ఎంఐఎంగా హాట్ హాట్ గా సాగుతోంది.

రాజాసింగ్ భేటీ బీజేపీలో అంతా సెట్ రైట్!:

హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఒక్క దెబ్బకు అంతా సెట్ రైట్ కాబోతున్నదా అనే చర్చ జరుగుతోంది. ఈ స్థానానికి కమలం పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగానే రాజాసింగ్ (Rajasingh) తీవ్రగా వ్యతిరేకించారు. నిజానికి గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజాసింగ్ తో భేటీ కావడం.. ఈ భేటీ తర్వాత తమకు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని బండి సంజయ్ తనకు పెద్దన్నలాంటి వారు అని రాజాసింగ్ కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఇద్దరు నేతలకు హిందుత్వ విషంయలో క్యాడర్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వీరి భేటీ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అలక బూనిన రాజాసింగ్ కు సర్థిచెప్పడంలో బండిసంజయ్ చర్చలు సక్సెస్ అయ్యాయని, ఇలా మిగాత నేతలు కూడా తమ మధ్య ఉన్న అభిప్రాయబేధాలు పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తే పార్టీ అంతా సెట్ రైట్ అవుతుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నా. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా ఇక్కడ వచ్చే పొలిటికల్ బూస్ట్ వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి రాబోతున్నదనే అంచనాలు సైతం కమలం పార్టీలో కనిపిస్తోంది. మరి బీజేపీ చేస్తున్న ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది ఏప్రిల్ 25న వెలువడనున్న హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ రిజల్ట్ తో తేలనుంది.

Next Story