KTR:కేటీఆర్ కు బండి సంజయ్ సహా ప్రముఖుల పరామర్శ

by Prasad Jukanti |

కేటీఆర్ కు పలువురు ప్రముఖులు పరామర్శించారు.

KTR:కేటీఆర్ కు బండి సంజయ్ సహా ప్రముఖుల పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జిమ్ లో వర్కౌంట్ చేస్తుండగా గాయపడిన కేటీఆర్ కు పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరామర్శిస్తున్నారు. కేటీఆర్ (KTR) త్వరగా కోలుకుని త్వరగా తిరిగి మంచి ఆరోగ్యం, బలాన్ని పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పరామర్శించారు. బండి సంజయ్ పోస్టుపై స్పందించిన కేటీఆర్ థాంక్యూ బండి సంజయ్ గారు అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ వేదికగా పరామర్శిస్తూ సోదరుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ కు గాయమైన సంగతి తెలిసి బాధపడ్డాను. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని, త్వరగా కోలుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ (Lokesh) ఆకాంక్షించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పరామర్శించారు. వీరందరి ట్వీట్లకు కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు.

Next Story