Bandi sanjay: వనజీవి రామయ్య మరణం పర్యావరణ సమాజానికి తీరని లోటు: బండి సంజయ్

by Prasad Jukanti |   (  Updated:2025-04-12 10:14:16  IST  )

వనజీవి రామయ్య మరణం పర్యావరణ సమాజానికి తీరని లోటు అని బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు.

Bandi sanjay: వనజీవి రామయ్య మరణం పర్యావరణ సమాజానికి తీరని లోటు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య (Vanjeevi Ramaiah) మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విచారం వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో కోటి మొక్కలకుపైగా నాటి పర్యావరణ పరిరక్షణకు అపారమైన సేవలు అందించి వనజీవి బిరుదుతో ప్రసిద్ధి గాంచిన రామయ్య మరణం బాధాకరం అన్నారు. రామయ్య తన కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టడం ద్వారా పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్న మహనీయుడని ఆయన సేవలను కొనియాడారు. రామయ్య సేవను గుర్తించి "పద్మశ్రీ" అవార్డుతో సత్కరించి మోడీ ప్రభుత్వం ఆయనకు సరైన గౌరవం అందించిందన్నారు. ఆయన మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అన్నారు.

READ MORE ...

CM Chandrababu: వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం


Next Story