మోడీ వచ్చేలోపు బండి సంజయ్ సమాధానం చెప్పాలి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |

బీజేపీ-బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు. సీబీఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సవాల్!

మోడీ వచ్చేలోపు  బండి సంజయ్ సమాధానం చెప్పాలి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. బీఆర్ఎస్ అక్రమాలపై ఎన్నికల ముందు బీజేపీ నేతలు సీబీఐ దర్యాప్తు కోరి ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ దర్యాప్తు చేయించకుండా మమ్మల్ని బద్నాం చేసేస్తున్నారని ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు (PM Modi Telangana Visit) వచ్చేలోపు సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తారో లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో బీజేపీకి 18 వేల ఓట్లు మాత్రమే వస్తే లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి 72 వేల ఓట్లు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ నేతల మద్దతు లేకుండానే బీజేపీకి అన్ని ఓట్లు వస్తాయా అని ప్రశ్నించారు.

వారితో మాకు పొంతనే లేదు:

ధాన్యం కొనుగోల్లలో మాకు, బీఆర్ఎస్‍కు పొంతనే లేదన్నారు. వరి వేస్తే ఉరే అని బీఆర్ఎస్ నేతలు గతంలో చెప్పలేదా? అని నిలదీశారు. మేం ఇప్పటికే 8,575 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సన్న బియ్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దేనని పేదలు, రైతులకు ఏకకాలంలో మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనన్నారు. ఇప్పపటికే రూ. 2,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

Next Story