- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manda Jagannadham Death: బండి సంజయ్, మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం
by Gantepaka Srikanth |
మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎంపీగా విజయం సాధించిన మంద జగన్నాథం తెలంగాణ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి తన సంతాపాన్ని ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటుపడిన నేతల్లో మందా జగన్నాథం ఒకరని కొనియాడారు.
Next Story






