- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: ‘రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం’.. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ షురువైంది. ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఒక్క రాత్రిలో ఎంత మార్పు వచ్చింది. ‘జై శ్రీరామ్ నినాదం మీకు తిండి లేదా ఉద్యోగం ఇవ్వదు నుంచి ‘రాముడిని ప్రార్థిద్దాం’ వరకు వచ్చిందని, ఇది రాముడు, రామ భక్తుల శక్తి వల్లే అంటూ సెటైర్లు వేశారు. ‘భక్త రామదాసును జైల్లో పెట్టిన తానాషా లాగా, శ్రీరాముడిని కలలో చూసి, రామ ముద్రలు దొరికినట్లే, కేసీఆర్ కొడుకుకు రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోందంటూ ఇచ్చిన కౌంటర్ ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This is the power of lord Ram & Ram Bhakts…
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) April 3, 2024
What a Change over in just one night- From “Jai Shri Ram slogan won’t give you food or job” to “let’s pray to Ram”
Like Tana Shah who jailed Sri Bhakta Ramadasu, saw Lord Shri Rama in his dream & found Rama Mudras, looks like KCR’s… pic.twitter.com/2Wy1HxVwBV