- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే: బండి సంజయ్
పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడమేమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్నిలదీశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడమేమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్నిలదీశారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్ సాక్షిగా మజ్లిస్ నేతలు వందేమాతర గేయాన్ని అవమానించినా ఎందుకు పట్టదని ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోయడం సరికాదన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గేయం ఆలాపాన సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కావడంతో నోటీసులివ్వడానికి భయపడుతున్నట్లు ఉందన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. నిండు సభలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు వందేమాతరం అవమానించినా చర్యలు తీసుకోవడం లేదంటే పలు అనుమాలకు తావునిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ నేతలు వందేమాతరంను అవమానిస్తున్నప్పుడు ఆయనతో సహా మంత్రులంతా సభలోనే ఉన్న ఎందుకు చర్చించ లేదన్నారు. సభ నియమ నిబంధనలను, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత వారికి ఎందుకు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని రోజు చేతిలో పట్టుకుని తిరుగుతున్నా ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేకపోవడం బాధకరమన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షుడైన గవర్నర్ సమక్షంలోనే ఉల్లంఘన జరిగినా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి ఏ సందేశాలు పంపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు స్పీకర్ఆదేశించాలని సూచించారు.






