- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల ఇబ్బందులను పట్టించుకోరా..? ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
by Kema Shiva Kumar |
కొండగట్టు (Kondagattu) దేవస్థానంలో ఆర్జిత సేవల రుసుమును భారీ పెంచడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కొండగట్టు (Kondagattu) దేవస్థానంలో ఆర్జిత సేవల రుసుమును భారీ పెంచడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మొదట మౌలిక వసతుల కల్పన మీద ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఆలయ అభివృద్ధిని విస్మరించడమే కాకుండా ఆర్జిత సేవా రుసుము పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. అనంతరం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. ఆర్జిత సేవా రుసుము పెంపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భక్తులు ఇబ్బందుకులను పట్టించుకోరా.. అని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన ఆర్జిత సేవా రుసుమును తగ్గించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Next Story






