- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : పాస్టర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం
'బజారు మహిళలే మల్లెపూలు పెట్టుకుంటారు' అంటూ ఏపీకి చెందిన పాస్టర్ షాలెం రాజు(Paster Shalem Raju) చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : 'బజారు మహిళలే మల్లెపూలు పెట్టుకుంటారు' అంటూ ఏపీకి చెందిన పాస్టర్ షాలెం రాజు(Paster Shalem Raju) చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన వ్యాఖలు చేస్తూ మహిళలని అవమాన పరిచేలా మతప్రబోధకులు అని చెప్పుకునేవారు మాట్లాడడం సిగ్గు చేటని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ప్రతి ఒక్క మహిళ గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యని ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసే వారికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. మరెవరో మరోసారి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ ఉదంతం ఓ గుణపాఠంగా ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. మతాన్ని అడ్డం పెట్టుకొని మహిళల్ని అవమానిస్తే ఊరుకునేది లేదని, పిచ్చిగా మాట్లాడితే తోలు తీస్తామని వార్నింగ్ ఇస్తూ.. తన X ఖాతా వేదికగా బండి సంజయ్ ట్వీట్ చేశారు.






