- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్.. సోనూసింగ్ కాల్పుల ఘటనపై బండి సంజయ్ హెచ్చరిక
కేసీఆర్ కంటే హీనమైన గతి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని బండి సంజయ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హిందువుల సహనానికి హద్దు ఉందని మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్ అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. మా దైవాన్ని, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే గోవులను వధించేవారు మంచివారిగా గోరక్షకుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం కాల్పుల ఘటన కేసులో పోలీసులు చెప్పిందంతా అబద్ధం అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రభుత్వమే పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గోవధ చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే ఆ పని చేస్తున్న సోనూసింగ్పై (Sonu Singh) పోలీసులే అభాండాలు మోపడం దుర్మార్గమన్నారు. గతంలో యాగాలకు ముందు గోవులకు పూజ చేసిన కేసీఆర్ గోవధను మాత్రం అమలు చేయలేదని అందుకే కేసీఆర్ కు పాపం తగిలి ఫామ్ హౌస్‌లో పడ్డారని అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంతకంటే హీనమైన గతి పడుతుందని హెచ్చరించారు. కాల్పుల్లో గాయపడిన సోనూసింగ్ను ఇవాళ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల శంకర్, పార్టీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోనూ సింగ్ వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని, అతనికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఎంఐఎం నేతకు రివాల్వర్ ఎట్లా వచ్చింది?
గోవులను రక్షించిన ప్రశాంత్ సింగ్‌పై కాల్పులు జరిపిన ఎంఐఎం నేత ఇబ్రహీంకు రివాల్వర్ ఎట్లా వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే ఆ పని చేస్తున్న ప్రశాంత్ సింగ్ పై పోలీసులే అభాండాలు మోపడం దుర్మార్గమన్నారు. తక్షణమే డీజీపీ క్షమాపణ చెప్పడంతోపాటు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోవులను చట్టానికి విరుద్ధంగా కబేళాకు తరలిస్తున్నారు. గోవులను రక్షించే ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్న సోనూసింగ్పై ఎంఐఎం పార్టీ గూండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గతంలోనూ గోరక్షకులపై దాడులు జరిగాయని ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పనిని చేతులెత్తేస్తే... ఆ పనిని నెరవేరుస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు చట్టానికి లోబడి గోమాతలను రక్షిస్తుంటే దాడులు చేసి చంపాలని చూస్తున్నారన్నారు.
గోవులను చంపాలని ఇస్లాంలో ఎక్కడా ఉంది?
గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే ముస్లిం ఓట్లు పోతాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతున్నాయని బండి ఆరోపించారు. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంఐఎం గూండాలు గోవులను వధించారు. భారతీయులందరూ గోమాతను తల్లిగా, దైవంగా భావించే సంస్కృతి ఉంది. ఇస్లాంలో ఎక్కడైనా గోవులను వధించాలని ఉందా? ఇకనైనా గోవులను మాతగా భావించాలన్నారు. అలా కాకుండా గోవులను వధిస్తే కన్న తల్లిని వధించినట్లేనన్నారు. అయినా చేస్తామంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాననని చెప్పారు. గోవులను గోశాలకు తరలిస్తామని సీఎం చెప్పడం కాదు... గోవధ చట్టాన్ని అమలు చేసి చేతల్లో చూపాలన్నారు. గోవులను రక్షించే వాళ్లను దోషులుగా, దాడులు చేసే వాళ్లను రక్షించడం దుర్మార్గం. దయచేసి మీడియా యాజమాన్యాలు ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపాలన్నారు. సోనూ సింగ్ రూ.5 లక్షలు డిమాండ్ చేశారని చెప్పడం దుర్మార్గం. ఇబ్రహీం వ్యాపారానికి రూ.కోటి నష్టం వాటిల్లిందని చెప్పడం సిగ్గు చేటని గోవులను వధించడం తప్పని చెప్పకుండా, గన్ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పకుండా నిందితుడికి వత్తాసు పలకడం దుర్మార్గం. థూ.. ఇదేనా ప్రభుత్వమంటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా గోవులను వధించే వాళ్లను పట్టుకోకుంటే భజరంగ్ దళ్ కార్యకర్తలు చేతులు ముడుచుకుని కూర్చోరు. వాళ్లే పట్టుకుని తగిన గుణపాఠం చెబుతారు. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే... ఏం చేసే వాళ్లమో మీరే చూస్తారని హెచ్చరించారు.
READ MORE ...
సోనూ సింగ్ కాల్పుల ఘటనలో జరిగింది ఇదే.. మీడియాకు రాచకొండ సీపీ సంచలన విషయాలు
రేవంత్ సర్కార్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్.. ఆ తర్వాత యాక్షన్ ఇదే అంటూ ప్రకటన






