- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ సర్కార్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్.. ఆ తర్వాత యాక్షన్ ఇదే అంటూ ప్రకటన
ఫీజు రీయంబర్స్ మెంట్(Fee Reimbursement) బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోపాటు విజిలెన్స్ దాడుల పేరుతో బెదిరించడాన్ని తెలంగాణ బీజేపీ(Telangana BJP) తీవ్రంగా పరిగణిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయంబర్స్ మెంట్(Fee Reimbursement) బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోపాటు విజిలెన్స్ దాడుల పేరుతో బెదిరించడాన్ని తెలంగాణ బీజేపీ(Telangana BJP) తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందితో నవంబర్ తొలి వారంలో ‘ఛలో హైదరాబాద్’ నిర్వహించేదుకు ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతోపాటు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించేదాకా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేదుకు కసరత్తు చేస్తోంది. గత రెండ్రోజులుగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు(Ramchander Rao)ను కలిసి మద్దతు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బండి సంజయ్ నివాసంలో పలువురు ఇంజినీరింగ్, బీఈడీ, ఇతర ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు(Private Colleges) సమావేశమయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. ‘‘తెలంగాణలో సుమారు 2500 ప్రైవేట్ విద్యా సంస్థలున్నాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, బీఈడీ, డిగ్రీ సహా సహా 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయంబర్స్ మెంట్‌పై ఆధారపడి ప్రైవేట్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వడంలేదు. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కాలేజీల్లో చదువు చెప్పే అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నాం. కాలేజీ అద్దెలు, మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేకపోతున్నం. జీతాలు రాకపోవడంతో అధ్యాపకులు సైతం నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. కాలేజీల నిర్వహణ పెనుభారంగా మారింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాయి. ‘‘ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయా విద్యార్థులు ఉన్నత కోర్సులకు వెళ్లలేక, ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అంతిమంగా 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోంది.’’ అని వాపోయారు. ఫీజు రీయంబర్స్ మెంట్‌పై ఆధారపడి చదివే విద్యార్థులంతా పేదరికం నుండి వచ్చినవాళ్లేనని, వాళ్లు సొంతంగా ఫీజులు కూడా చెల్లించే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇస్తున్న హామీలేవీ అమలు కావడం లేదని వాపోయారు. ‘‘పోయిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ప్రతినెలా రూ.500 కోట్ల చొప్పున ఏడాదిలో రూ.6 వేల కోట్లు చెల్లిస్తానని, వీటితోపాటు మిగిలిన బకాయిలన్నీ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు ఒక్క నెల బకాయిలు కూడా చెల్లించలేదు. మాటను నిలబెట్టుకోనందుకు తాము సమ్మె నోటీసు ఇస్తే కాలేజీల్లో తనిఖీల పేరుతో విజిలెన్స్ టీంలను పంపి బెదిరిస్తున్నారు’’ అంటూ వాపోయారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తే తనిఖీలు చేసినా తమకు ఇబ్బంది లేదని, తాము పొరపాట్లు చేస్తే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కాలేజీల యాజమాన్యాల ఆవేదన విన్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌లతో మాట్లాడారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేలా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల పక్షాన బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపై కాలేజీ యాజమాన్యాలతో బండి సంజయ్, లక్ష్మణ్ చర్చించారు. రెండు, మూడు రోజుల్లో ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతోపాటు నవంబర్ మొదటి వారంలో రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంపై చర్చలు జరిపారు. ఒకటి, రెండ్రోజుల్లో బీజేపీ పక్షాన రాష్ట్ర నాయకత్వం యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.






