Bandi Sanjay: తెల్లవారితే బీజేపీ బహిరంగ సభ.. కేడర్‌కు బండి సంజయ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-06 18:28:18  IST  )

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) ఏడాది పాలనా వైఫల్యాలపై బీజేపీ(BJP) ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు.

Bandi Sanjay: తెల్లవారితే బీజేపీ బహిరంగ సభ.. కేడర్‌కు బండి సంజయ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) ఏడాది పాలనా వైఫల్యాలపై బీజేపీ(BJP) ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(JP Nadda) ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారన్నారు. కనీవినీ ఎరగని రీతిలో భారీ ఎత్తున ప్రజలు హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఏడాది పాలనలో కాంగ్రెస్(Congress) చేసిన మోసాలను, వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తేవడంలో భాగంగా సభ నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు హాజరై సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ విజయోత్సవాలను నిర్వహిస్తుండగా.. కౌంటర్ ఇచ్చేందుకు కాషాయ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల బీజేపీ(BJP) ఆధ్వర్యంలో నిర్వహించే తొలి బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం.

Next Story