- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: అలా చేస్తే కేంద్రాన్ని ఒప్పిస్తాం.. బీసీ రిజర్వేషన్లపై సర్కార్‌కు బండి సంజయ్ సవాల్
దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ‘కన్వర్టడ్ బీసీ’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్య తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ‘కన్వర్టడ్ బీసీ’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్య తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అయితే, సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ (Firoz Khan Gandhi) అనే విషయం అసలు సీఎంకు తెలుసా.. అని ప్రశ్నించారు. ఆయన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) ఇటలీ (Italy) దేశానికి చెందిన క్రైస్తవురాలని లోకానికి తెలియదా అని అన్నారు.
కులం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రధానిని తూలనాడుతున్నారని.. అసలు రాహుల్‌కు కుల, మతం, జాతి, దేశం లేదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన కులంపై రేవంత్ ఏం సమాధానం చెబుతారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ బీసీనా.. ఎస్సీనా లేక ఎస్టీనా సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరివితో తల గోక్కునేలా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ఆరు గ్యారంటీ (Six Guarantees)ల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే సీఎం, ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. ఒకవేళ 10 శాతం ఉన్న ముస్లింలను బీసీల కేటగిరి నుంచి తొలగిస్తే.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంతో అమోద ముద్ర వేయిస్తామని బండి సంజయ్, రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు.






