- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాట్ పట్టిన బండి సంజయ్..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్రీడాకారుడిగా మారి అలరించారు.

దిశ, హుస్నాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్రీడాకారుడిగా మారి అలరించారు. కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న క్రమంలో, హుస్నాబాద్ మర్రి ఎక్స్ రోడ్ సమీపంలో యువకులు నిర్వహిస్తున్న ‘యూనిటీ కప్’ క్రికెట్ టోర్నమెంట్‌ను చూసి ఆయన తన కాన్వాయ్‌ను ఆపారు. వందలాది మంది యువత కేరింతల మధ్య మైదానంలోకి వెళ్లిన మంత్రి, క్రీడాకారుల కోరిక మేరకు బ్యాట్ పట్టారు. యువకులు వేసిన బంతులను ఎదుర్కొని, రెండు ఆకర్షణీయమైన బౌండరీలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికి కాకుండా ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా, క్రీడా స్ఫూర్తితో ప్రశాంతంగా ఆడుకోవాలని యువతకు సూచించారు. బల్లునాయక్ తండా, మీర్జాపూర్ వంటి గ్రామాల నుంచి వచ్చిన జట్లతో ఆయన కాసేపు ముచ్చటించి, వారి ఉత్సాహాన్ని అభినందించారు. కేంద్ర మంత్రి స్వయంగా మైదానంలోకి వచ్చి క్రికెట్ ఆడటంతో స్థానిక యువతలో నూతనోత్సాహం నెలకొంది.






