- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: రేవంత్ రెడ్డి మాటలకు నా రక్తం మరిగింది.. మోడీతో రేవంత్ భేటీ వేళ బండి సంజయ్ ట్వీట్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు తన రక్తం మరిగిపోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. 75 ఏళ్ల వయసు కలిగిన ప్రధాన మంత్రిని పట్టుకుని రేవంత్ రెడ్డి తెలంగాణకు ప్రాజెక్టులు ఇస్తావా లేదా చస్తావా అన్నారని మండిపడ్డారు. నిన్న డీసీసీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేపు ఢిల్లీలో ప్రధానిని కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధిచి అడగబోతున్నామని మనం అడిగే ప్రాజెక్టులకు కేంద్రం ఓకే చెప్తే సరే లేదా రాష్ట్రంలో బీజేపీని ఏం చేయాలో ప్రజలు అదే చేస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించిన బండి సంజయ్ ఈ మాటలు విన్నాక నాకు రక్తం మరిగిపోయింది కానీ ప్రధాని మాత్రం ఆ మాటలను ఏమీ పట్టించుకోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ఇవాళ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారన్నారు. ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో (Narendra Modi) భేటీ నేపథ్యంలో ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. నిన్న ప్రధానిపై అంతలా మాటలు అన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం వాటిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి తనను కలిసేందు ప్రధాని అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ ఉద్దేశంలోని స్పష్టతనే తన బాస్ మోడీని ప్రత్యేకంగా నిలబెడుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మోడీ ఎప్పుడూ ప్రజల కోసం మంచి చేసే రాజనీతిజ్ఞుడు అని అదే అత్యున్న విశ్వాసం అని రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చాలా సహకరిస్తోందని ఇది నేను చెబుతున్న మాట కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారంటూ సీఎం వీడియోను సైతం బండి సంజయ్ షేర్ చేశారు.






