భారత సైనికులను అవమానిస్తారా?.. CM రేవంత్ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్(Jubilee Hills) ప్రచారంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌(Bandi Sanjay)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత సైనికులను అవమానిస్తారా?.. CM రేవంత్ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills) ప్రచారంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌(Bandi Sanjay)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ పేరు ప్రస్తావిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘జూబ్లీహిల్స్‌లో భారత్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన పాకిస్తాన్ మనపై దాడి చేసింది, కానీ భారత్ స్పందించలేదు అని చెప్పి దేశ గౌరవాన్ని దెబ్బతీశారు. సీఎం వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల ధైర్యసాహసాలకే అవమానం. భారతదేశంలోని ప్రతి వీధి మన జవాన్ల సాహసంపై గర్వంతో నిండింది. ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది.. ఇది ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన చర్యకు ప్రతీక. భారత ప్రజలకు, దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వీడియో

Next Story