- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతకు క్రీడా రంగంలో అద్బుతమైన అవకాశాలు కల్పిస్తున్నాం: జమ్మూ కాశ్మీర్‌లో బండి సంజయ్
శంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితంలో క్రీడలను ఒక జీవనశైలిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితంలో క్రీడలను ఒక జీవనశైలిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో క్రీడా రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు సృష్టించే దిశ చర్యలు చేపడుతోందన్నారు. గురువారం జమ్మూ కాశ్మీర్‌లో ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి వసతులతో జమ్మూ, కాశ్మీర్‌లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో జాతీయ క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని ప్రతి స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. పోలీసు, పారామిలిటరీ సిబ్బందిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ వంటి జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఐక్యతా భావంతో నిండిన అందమైన నగరం శ్రీనగర్ ఈ క్రీడా సమావేశానికి అద్భుతమైన వేదికగా నిలవడం ఆనందంగా ఉంది. క్రీడలు మానవ సంబంధాలను నిర్మించడంతో పాటు స్నేహాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయడానికి ఈ జూడో పోటీలే నిదర్శనమన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి నిష్పక్షపాత క్రీడాస్ఫూర్తిని చాటి మరపురాని పోటీలుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి స్థాయిలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తోందన్నారు.






