- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ సంచలన ఆరోపణలు..తెలంగాణలోనూ బెంగాల్ తరహా పరిస్థితులు
రేవంత్ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay ) సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బెంగాల్ ( Bengal) తరహా

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay ) సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బెంగాల్ ( Bengal) తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ( Telangana State) రాబోతున్నాయని బాంబు పేల్చారు బండి సంజయ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆఫీస్ లో (BJP) బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో వక్ఫ్ బిల్లుకు ( Waqf Bill ) వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతాయన్నారు. ఇది కంట్రోల్ తప్పితే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.
అటు నేషనల్ హెరాల్డ్ కేసు ఇష్యూపై ( National Herald case issue ) కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా మీద బండి సంజయ్ సెటైర్లు వేశారు. అదొక బూతు ధర్నా.. బూతు మాటలు తప్ప అందులో సాధించిందేమీ లేదని చురకలు అంటించారు. దాన వీర శూర కర్ణలో అన్ని పాత్రలు ఎన్టీఆర్ ఒక్కరే పోషించినట్టు.. కాంగ్రెసోళ్లు కూడా హీరోలు, విలన్లు, బ్రోకర్లు, జోకర్లంటూ చురకలు అంటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
ఇక అటు బండి సంజయ్ (Bandi Sanjay ) వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud). బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి అనే విషయం కూడా మర్చిపోతాడు.. పూనకంలో ఏం మాట్లాడుతాడో కూడా ఆయనకే తెలియదని చురకలు అంటించారు మహేష్ కుమార్ గౌడ్.
రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలుత్వరలోనే బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయిప్రభుత్వ సహకారంతో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతాయిఇది కంట్రోల్ తప్పితే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయి#BandiSanjay #RevanthReddy #Telangana #BJP pic.twitter.com/1kOEct8Vdh— PulseNewsBreaking (@pulsenewsbreak) April 18, 2025






